అంతర్జాతీయం (International) వార్తలు (News)

ప్రతీ ఇంట్లో దెయ్యాలకు సెపరేట్ రూమ్స్.. ఎక్కడ??

భారతదేశం మాదరిగానే థాయ్‌లాండ్ దేశంలోనూ బోలెడన్నీ ఆలయాలు ఉంటాయి. కానీ అక్కడ బౌద్ధ మతానికి చెందిన టెంపుల్స్ ఎక్కువగా ఉండి రాముడు, విష్ణువును ప్రజలు పూజిస్తుండటం విశేషం. సాంస్కృతిక వారసత్వంలోనూ థాయ్‌లాండ్, భారతదేశానికి అవినాభావ సంబంధముందని చెప్పొచ్చు.

అయితే థాయ్‌లాండ్ దేశ నేషనల్ బర్డ్ గరుడ పక్షి కాగా ఇండియాలో హిందువులు భక్తితో ఆరాధించే విష్ణువు వాహనం గరుడ. ఇకపోతే గరుడ పురాణం ఇండియాలో కూడా ఉంది. మన దేశంలో భారతీయలు అత్యంత పవిత్ర గ్రంథాలుగా భావించే రామాయణం, మహాభారతం కాగా, థాయ్‌లాండ్‌లో జాతీయ గ్రంథంగా రామ్ కియన్ ఉండటం గమనార్హం. రామ్ కియన్ అనగా థాయ్‌లాండ్ భాషలో రామాయణం అని అర్థం. థాయ్‌లాండ్ ప్రజలకూ భారతీయుల మాదిరిగా నమ్మకాలు ఎక్కువే.

భారత దేశంలో దాదాపుగా ప్రతీ ఇంట్లో తాము నమ్మే దేవుడి కోసం చిన్న పూజ గది కట్టించుకుంటారు. అయితే, థాయ్‌లాండ్‌లో మాత్రం భిన్నంగా దెయ్యాలకు సెపరేట్ రూమ్ ఉంటుందట. ఆత్మల పట్ల వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుందని, ఈ క్రమంలోనే దెయ్యాలకు, ఆత్మలు కొలువు దీరి ఉండటం కోసమే సెపరేట్ రూమ్ ఏర్పాటు చేస్తూ ఉంటారని స్థానికులు చెప్తున్నారు. ఈ కంట్రీ క్యాపిటల్ నేమ్ ప్రపంచంలోనే అతి పెద్దగా ఉండటం విశేషం. థాయ్‌లాండ్ వాసులు కూడా భారతీయులకు దగ్గరి పోలికలతో ఉంటారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •