వార్తలు (News)

పులిచింతల సమీపంలో మూడు సార్లు భూప్రకంపనలు!!

గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో ఆదివారం ఉదయం 7.15 గంటల నుంచి 8.20 గంటల వరకు మూడు సార్లు భూమి కంపించినట్లు భూభౌతిక పరిశోధన ముఖ్యశాస్త్రవేత్త శ్రీనగేశ్‌ తెలిపారు. భూకంపలేఖినిపై దీని తీవ్రత 3.0, 2.7, 2.3గా నమోదైనట్లు ఆయన వివరించారు. పులిచింతలతోపాటు తెలంగాణ పరిధిలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోనూ భూ ప్రకంపలను వచ్చాయి. గతవారం రోజులుగా పులిచింతల సమీపంలో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •