క్రైమ్ (Crime) వార్తలు (News)

ఆర్యన్ ఖాన్ కు జైలులో లభిస్తున్న సౌకర్యాలు..??

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ కస్టడీలో ఉన్న షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఓ వైపు దర్యాప్తు అధికారులకు తనవంతు సహకారం అందిస్తూనే మరొక వైపు సైన్స్ పుస్తకాలను తిరగేస్తున్నాడు. గురువారం వరకూ ఆయన ఏసీబీ కస్టడీలో ఉండాల్సి ఉండగా ఆర్యన్ ఖాన్ కోరిక మేరకు అధికారులే ఈ పుస్తకాలను అతనికి సమకూర్చారు.

ఆర్యన్ ఖాన్‌కు ఆహారంతో సహా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వడం లేదంటూ ఇంతకుముందు వార్తలు వచ్చినప్పటికీ ఆర్యన్‌తో పాటు ఈ కేసులో ఇతర నిందితులకు కూడా ఎన్‌సీబీ మెస్‌ నుంచి అధికారులు భోజన సదుపాయం కల్పించారు. ఇంటి భోజనాన్ని లోపలకు అనుమతించడం లేదు. ఇప్పటికే వారందరి దగ్గర నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు గాంధీనగర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వాటిని పంపారు. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్స్‌లో అంతర్జాతీయ రాకెట్‌తో సంబంధాలున్నాయనడానికి తగిన సాక్ష్యాలను తాము సేకరించినట్టు ఇంతకముందు సిటీ కోర్టుకు ఎన్‌సీబీ తెలిపింది. ఖాన్ ఫోన్ నుంచి జరిగిన సంభాషణల్లో చెల్లింపులు ఏ పద్దతిలో ఉండాలి? కోడ్ పేర్లు వంటికి చోటుచేసుకున్నట్టు వెల్లడించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    4
    Shares
  • 4
  •  
  •  
  •  
  •