ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే..??

శరీరంలో చేరే కొలెస్ట్రాల్ మొత్తం చెడ్డది కాదు. అందులో మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంది. అది మన శరీరానికి అవసరం కూడా. అయితే చెడు కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతేనే బరువు పెరగడం అనే సమస్య మొదలవుతుంది. సర్జరీలు చేయించుకోవడం, జిమ్ లో అధికసమయాలు గడపడం కన్నా జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా బరువు పెరగకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు.

చిప్స్, చాక్లెట్లు, బజ్జీలు, బోండాలు, మిర్చిబజ్జీలు వంటి చిరు తిళ్లు బరువు పెంచడానికి ప్రయత్నిస్తాయి. కనుక వీటిని దూరం పెట్టి ఇలాంటి చిరుతిళ్లకు బదులుగా బాదం, జీడిపప్పు, పిస్తా వంటి ఒక గుప్పెడు తింటే చాలు. వీటిలో కూడా కొవ్వును తగ్గించే గుణాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే అధికంగా తింటే మాత్రం కొవ్వు పట్టేస్తుంది. వీటి వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది.

బ్రేక్ ఫాస్ట్ టైమ్ లో దోశెలు, పూరీలు, బోండాలు తినడం మానేస్తే అధిక బరువు సమస్య ఎదురుకాదు. బ్రౌన్ రైస్, జొన్నలు, ఓట్స్, సజ్జలు వంటి చిరు ధాన్యాలతో చేసిన వంటకాలు తింటే త్వరగా ఆకలి వేయదు. కాబట్టి అధికంగా తినే అవకాశం ఉండదు, తద్వారా బరువు అదుపులో ఉంటుంది.

బరువు పెరగకుండా కాపాడుకోవడానికి, పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చేపలు సహకరిస్తాయి. ఇందులో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు రక్తంలో హానికర ట్రైగ్లిజరైడ్లను చేరకుండా అడ్డుకుంటాయి. కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపలోని కొవ్వులోనే ఉంటాయి. కనుక కొవ్వు పట్టిన సాల్మన్, సార్ డైన్, టూనా వంటి చేపలు తినడం మంచిది. కాకపోతే వీటిని కూరగా వండుకునే తినాలి కానీ, నూనెలో వేయించుకుంటే మాత్రం బరువు పెరుగుతారు.

ఒత్తిడి… ఆధునిక కాలంలో ఎక్కువమంది ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తున్న మహమ్మారి ఇది. అధిక ఒత్తిడి బరువు పెరిగేందుకు కూడా సహకరిస్తుంది. ఒత్తిడి వల్ల రక్తపోటు పెరుగుతుంది, కొలెస్ట్రాల్ శాతం కూడా ఎక్కువ కావచ్చు. అందుకే ధ్యానం, యోగా లాంటి వాటితో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

ఏమి తిన్నా కూడా బరువు తగ్గడానికి ఎక్కువ సాయం చేసేది వ్యాయామం. తినేసి కూర్చుంటే ఎవరైనా బరువు పెరుగుతారు. రోజులో ఒక గంట పాటూ వేగంగా నడక అలవాటు చేసుకుంటే మంచిది. దీని వల్ల పక్షవాతం, గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుని మీకు సమాచారం అందచేసాము. అయితే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    34
    Shares
  • 34
  •  
  •  
  •  
  •