జాతీయం (National) వార్తలు (News)

వరుసగా నాలుగో రోజు చమురు ధరల పెంపు!!

ఆయిల్ కంపెనీలు వరుసగా నాలుగో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్‎పై 31 పైసలు, డీజిల్‎పై 38 పైసల చొప్పున పెరగడంతో హైదరాబాద్‎లో లీటరు డీజిల్ Rs100.51 పైసలకు, పెట్రోలు Rs107.73 పైసలకు చేరింది. దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ Rs103.54 పైసలకు, డీజిల్ Rs92.12 పైసలకు పెరిగింది. ముంబైలో పెట్రోల్ Rs109.54 పైసలకు, డీజిల్ Rs99.22 పైసలకు చేరింది. కోల్‎కతాలో పెట్రోల్ Rs104.23 పైసలకు, డీజిల్ Rs95.23 పైసలకు పెరిగింది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి నిత్యావసరంగా మారిన టూవీలర్‎ను కూడా వాడుకోలేని పరిస్థితి వస్తోందని, పెట్రోల్, డీజీల్ మరియు గ్యాస్ ధరలు చూస్తుంటే దసరా పండుగను సంతోషంగా ఎలా జరుపుకోగలమని సగటు మధ్యతరగతి వర్గం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •