జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఢిల్లీ పోస్టల్‌ సర్కిల్‌లో స్పోర్ట్స్‌ కోటా లో పోస్టులు!!

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన పోస్టల్‌ విభాగం, ఢిల్లీ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం స్పోర్ట్స్‌ కోటా ద్వారా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
మొత్తం ఖాళీలు: 221
పోస్టల్‌ అసిస్టెంట్‌/సార్టింగ్‌ అసిస్టెంట్‌: 72
అర్హత: ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణత
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.25,500 నుంచి రూ.81,800 వరకు చెల్లిస్తారు
పోస్ట్‌ మ్యాన్‌: 90
అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.21,700 నుంచి రూ.59,100 వరకు చెల్లిస్తారు
మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌: 59
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.18000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 11
వెబ్‌సైట్‌: https://www.indiapost.gov.in/vas/ Pages/IndiaPostHome.aspx

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •