టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

వాట్సప్ ని వదిలి టెలిగ్రామ్‌కు “క్యూ” కట్టిన యూజర్లు..!!

వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లు అక్టోబర్ 4 సోమవారం రాత్రి పని చేయని సంగతి పాఠకులకు విదితమే. రాత్రి తొమ్మిది గంటలకు అంతరాయం తలెత్తగా మళ్లీ ఉదయం నాలుగు గంటల వరకూ అదే పరిస్థితి కనిపించింది. ఇక గతంలో కూడా ఇలా వాట్సాప్ చాలాసార్లు ఒక్కసారిగా నిలిచిపోయింది. అయితే ఒక యాప్ పనితీరు సరిగ్గా లేకపోతే మరో యాప్ కు యూజర్లు షిఫ్ట్ అవుతారని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాట్సాప్ ఇన్ స్టాగ్రామ్ ఫేస్ బుక్ యూజర్లు ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ కు జై కొడుతున్నారు. టెలిగ్రామ్ తో పాటు సిగ్నల్ లాంటి మెసేజింగ్ యాప్ ను కూడా కోట్లమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల వాట్సాప్ కు అతంరాయం నెలకొన్న నేపథ్యంలో టెలిగ్రామ్ ఎంతో లాభపడింది. కొత్తగా కోట్ల మంది యూజర్లు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సైన్ ఇన్ అవ్వగా టెలిగ్రామ్ సర్వీసులు నెమ్మది కాగా ఎన్నో ఫిర్యాదులు కూడా వచ్చాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    10
    Shares
  • 10
  •  
  •  
  •  
  •