వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

ఈ ఓటములను స్వీకరించి ముందుకు సాగాలి: ధోనీ !!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ లీగ్‌ దశను పూర్తి చేసుకుని గురువారం పంజాబ్‌ చేతిలోనూ ఓటమిపాలై రెండో స్థానంలో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్‌లు ఓటమిపాలవ్వడమే ఆ జట్టును కంగారును గురి చేస్తున్న నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ధోనీ మాట్లాడుతూ వాస్తవాలను అర్థం చేసుకొని మసలుకోవాలని పేర్కొన్నాడు.

ఈ ఓటములను స్వీకరించి అది మానసికంగా అయినా లేదా నైపుణ్యాల పరంగానైనా అర్థం చేసుకొని వెళ్లాలి. మేం ప్లేఆఫ్స్‌ చేరడానికి బాగా కష్టపడ్డాం. అయినప్పటికీ ఈ రెండు మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాం. అందులో ఒకటి గెలవాలని ప్రయత్నించినా కుదరలేదు. ఇలాంటి లీగుల్లో ఇవన్నీ సహజమే. ఏదైమైనా మనం విజయం సాధించాలంటే అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. అయితే, మా ఓటములకు పట్టుదల లేకపోవడం అనేది మాత్రం కారణం కాదు.

మా ఆటగాళ్లంతా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మేం ఏం చేయాలనేదానిపై కొంచం దృష్టి సారిస్తే సరిపోతుంది. మరోవైపు కొన్నిసార్లు టాస్‌ కూడా మాకు కలిసిరాలేదు. ఇది కాస్త కఠినమైన పిచ్‌. కానీ మొత్తంగా చూస్తే ఫర్వాలేదని చెప్పొచ్చు’ అని ధోనీ వివరించాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    2
    Shares
  • 2
  •  
  •  
  •  
  •