తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 38,085 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 205 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో ఒకరు మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,002కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారి నుంచి 185 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,871 యాక్టివ్‌ కేసులున్నాయి.