దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12,13,130 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 8,439 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.46 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 195 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4.73 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 9,525 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.40 కోట్లకు చేరింది. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 93,733కి చేరింది.