తమిళనాడులో కొయంబత్తూర్, కూనూరు మధ్యలో భారత సైన్యానికి చెందిన ఒక ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఘటన సమయంలో హెలికాప్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కూడా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలినట్లు తెలుస్తోంది. ఘటనా సమయంలో చాపర్లో 14 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు దూరదర్శన్ న్యూస్ ప్రకటనలో తెలియ చేసింది.