నేటి దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 642 పాయింట్ల లాభంతో 58,275 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 192 పాయింట్ల లాభంతో 17,369 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, టీసీఎస్‌ షేర్లు లాభాలబాట పట్టాయి. ఒక్క టైటన్‌ షేర్లు మాత్రం నష్టాల్లో పయనిస్తున్నాయి.