డిగ్రీ పూర్తి చేసిన వారికోసం సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 520 గూడ్స్ గార్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు చూద్దాం..
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య 520 ఉండగా దరఖాస్తుకు చివరి తేదిగా 2021 డిసెంబర్ 23
నిర్ణయించారు. విద్యార్హతకు సంబంధించి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 42 ఏళ్ల వయస్సుకు మించకూడదు.

కేటగిరి వారీగా ఉద్యోగాల ఖాళీలు :
జనరల్-227
ఓబీసీ-87
ఎస్సీ-126
ఎస్టీ-30

రాతపరక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది కాబట్టి ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కట్ చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి సమాాచారం, దరఖాస్తు ప్రక్రియ కోసం http://www.rrcser.co.in వెబ్ సైట్ ను చూడొచ్చు.