కడప శివారు కేఎస్‌ఆర్‌ఎమ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంలోకి మంగళవారం తెల్లవారు సమయంలో ఐదుగురు వ్యక్తులు ప్రవేశించి గ్యాస్‌ కట్టర్‌ సాయంతో ఏటీఎంలోకి ప్రవేశించి రూ.17లక్షల నగదును అపహరించారు. అందులోని సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఏటీఎం మిషన్‌ను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయం ఏటీఎం చోరీని గుర్తించిన బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ వెంకట శివారెడ్డి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌తో పరిసర ప్రాంతాల్లో ఆధారాలు సేకరించారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ వివరించారు.