కోవిడ్ నుండి కోలుకున్న చాలామందిలో అలసట ఎక్కువగా కనిపిస్తుంది. దానికి కారణం శరీరానికి అవసరమైన శక్తి అందక పోవడం. అందుకే ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకుంటే ఇటువంటి సమస్యలు ఉండవు. ఐరన్ సమృద్ధిగా ఉండేలా ఒక లడ్డు తయారు చేసి ఆ లడ్డూను రోజుకి ఒకటి తింటే ఎన్నో రకాల సమస్యల నుంచి బయట పడవచ్చు.

దీనికోసం ముందుగా పాన్ వెలిగించి నూనె లేకుండా ఒక కప్పు అవిసె గింజలు, ఒక కప్పు తెల్ల నువ్వులు వేసి సిమ్ లో పెట్టి వేపాలి. వేగినఅవిసె గింజలు, నువ్వులు కాస్త చల్లారాక మెత్తని పౌడర్ గా తయారు చేసుకోవాలి. బాదం పప్పులను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి తురిమిన బెల్లాన్ని వేసి కొంచెం నీటిని కలిపి తీగ పాకం వచ్చేవరకు పొయ్యిమీద ఉంచాలి. తీగపాకం వచ్చాక దానిలో తయారుచేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టిన బాదంపప్పులను కూడా వేయాలి. మిశ్రమం బాగా కలిసేలా బాగా కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డుగా తయారు చేసుకోవాలి. ప్రతిరోజు ఒక లడ్డు తింటూ ఉంటే రక్తహీనత, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలసట, నీరసం వంటివి ఏమీ ఉండవు. ఈ లడ్డులు ఒకసారి తయారు చేసుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒకరు ఈ లడ్డు తినవచ్చు.