వడ్లు చేతికి వచ్చి 2 నెలలౌతున్నా కొన్నది మాత్రం 32 శాతమే అని రైతులు బాధపడుతున్నారు. అదే విధంగా ఎక్కడికక్కడ కల్లాల్లో, రోడ్ల పొంట, కొనుగోలు సెంటర్లలో వడ్ల కుప్పలు పేరుకుపోతూ ఎండకు ఎండి, వానకు తడిసి పాడైపోతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొనలేదు. వడ్లను కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. సెంటర్లకు తెచ్చి రోజులు, నెలలు గడుస్తున్నా కోనట్లేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కారు ఇప్పటివరకు 31.94 లక్షల టన్నుల వడ్లను మాత్రమే కొన్నది అలాగే కొన్ని సెంటర్లలో కాంటాలు పెట్టినా.. లోడ్​ చేయడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఈ వానాకాలం పూర్తయ్యేనాటికి కోటీ మూడు లక్షల టన్నుల వడ్లు కొనాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకుంది. ఆ తర్వాత వడ్ల కొనుగోళ్లపై పంచాయితీ జరుగుతుండడంతో తాజాగా టార్గెట్‌‌‌‌‌‌‌‌ను తగ్గించుకున్నది. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్న టార్గెట్‌‌‌‌‌‌‌‌లో 18.96 లక్షల టన్నులు తగ్గించి.. 84.14 లక్షల టన్నులు కొనాలని నిర్ణయించుకుంది అని రైతులు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొంటామని అక్టోబర్​లో ప్రకటన చేసింది. సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌ శాఖ మొదట పెట్టుకున్న టార్గెట్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటి వరకు 32 శాతం మించి కొనుగోళ్లు చేపట్టలేదు. ఫస్ట్​ పెట్టుకున్న టార్గెట్​ 1.03 కోట్ల టన్నులు కాగా.. అందులో శనివారం నాటికి కొన్నది 31.94 లక్షల టన్నులు మాత్రమే. గత సంవత్సరం కంటే ఈసారి దాదాపు నెల రోజుల ముందే పంట చేతికొచ్చింది. అలాగే వివిధ జిల్లాలో 4,754 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 249 సెంటర్లు ఓపెన్​ చేసినా.. 21 సెంటర్లలోనే వడ్లు కొంటున్నారు . కొత్తగూడెం జిల్లాలో 166 సెంటర్లకు గాను 2 సెంటర్లలో, వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 161 సెంటర్లకుగాను 40 సెంటర్లలో, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 202 సెంటర్లకుగాను 19 సెంటర్లలో, మంచిర్యాల జిల్లాలో 230 సెంటర్లకుగాను 53 సెంటర్లలో, వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 127 సెంటర్లకు గాను 42 సెంటర్లలో కొనుగోళ్లు జరుగుతున్నాయి అని రైతులు అన్నారు.

వడ్ల కొనుగోలు సెంటర్లలో రైతులను అనేక సమస్యలు వేధిస్తున్నాయి. లారీలు రాక, సెంటర్లలో ధాన్యం కాంటా పెట్టక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వడ్లను కాంటా పెట్టినా.. లారీలు రావట్లేదు. ఇంకొన్ని చోట్ల లారీల్లో లోడ్లు వెళ్లినా మిల్లర్లు దించుకోవట్లేదు. తమ దగ్గర వడ్లు కొనడం లేదంటూ పలు చోట్ల రైతులు రాస్తారోకోలకు దిగుతున్నారు. వానకు తడిసి వడ్లు మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెల్లికుదురు మండలంలో ఒకరైతు మా దగ్గర ఇప్పటికీ కొనుగోలు సెంటర్​ను ఏర్పాటు చేయలేదు, ఊరిలో వంద మంది రైతులం వడ్లు ఎండపోసుకుని కాపలా కాస్తున్నాము. పగలంతా ఎండ బోసి, రాత్రి కుప్పల మీద పట్టాలు కప్పుకోవాల్సి వస్తున్నది వడ్లు పోస్తే కాంట పెట్టక 15 సంచుల వడ్లల్లో మొలకలు వచ్చాయని పేర్కొన్నారు.