నేటి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలు గడించాయి. కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంచనున్నామన్న ఆర్బీఐ ప్రకటన మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న సానుకూల సంకేతాలు, మరోపక్క దేశీయంగా అన్ని దిగ్గజ కంపెనీ షేర్లు పరుగులు తీయడంతో మార్కెట్లు భారీ లాభాలను అందుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ 58,158.56 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై ఇంట్రాడేలో 58,702.65 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 1,016.03 పాయింట్ల లాభంతో 58,649.68 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,315.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో 17,484.60 వద్ద గరిష్ఠాన్ని తాకిన అనంతరం 291.65 పాయింట్లు లాభపడి 17,468.35 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, మారుతీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో ముగిసాయి. పవర్‌గ్రిడ్ మాత్రం నష్టాల్లో ముగిసింది.