దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15,63,566 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 1,59,632 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 327 మరణాలు సంభవించడంతో ఇప్పటి వరకూ మరణించిన వారి మొత్తం సంఖ్య 4,83,790కి చేరింది. గత 24 గంటల్లో 40,863 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకూ కరోనా నుండి కోలుకున్నవారి సంఖ్య 3.44 కోట్లు దాటింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 5.9 లక్షలకు చేరింది.

దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 3,623కు చేరింది. మహారాష్ట్రలో ఈ కేసుల సంఖ్య వెయ్యి దాటి తొలి స్థానంలో ఉండగా.. దిల్లీ 513, కర్ణాటక 441, రాజస్థాన్‌ 373 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ వేరియంట్‌ నుంచి ఇప్పటికే 1,409 మంది కోలుకున్నారు.

జిల్లాల వారీగా ఓమిక్రాన్ కేసుల వివరాలు..