హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములపై హైకోర్టు కీలక తీర్పునిస్తూ భూములపై హెచ్‌సీయూకి చట్టబద్ధత హక్కులకు ఆధారాల్లేవని, అయితే భూములపై హక్కుల కోసం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.

జీహెచ్ఎంసీ రోడ్డు నిర్మించడాన్ని సవాల్ చేస్తూ హెచ్‌సీయూ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది .రాష్ట్ర ప్రభుత్వం 1975లో 2,324 ఎకరాల భూమిని వర్సిటీకి కేటాయించింది. కానీ ఈ భూ కేటాయింపుపై ఉత్తర్వులు, ఇతర ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది హైకోర్టు. HCU కోసం ఇచ్చిన 2 ,324 ఎకరాల భూమిని ప్రభుత్వం మ్యుటేషన్‌ చేయలేదు. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి ఇప్పటికీ సర్కార్ భూమిగానే ఉంది. ఈ విషయంపై విశ్వవిద్యాలయ అధికారులు నాలుగైదుసార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు కూడా రాశారు.