తెలంగాణలో ఏప్రిల్‌లో జరిగే ఇంటర్‌ మొదటి, రెండో ఏడాది పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలను ఇంటర్‌ బోర్డ్‌ గురువారం ప్రకటించింది. ఫస్టియర్‌ అన్ని గ్రూపులకు, సెకండియర్‌ ఆర్ట్స్‌ గ్రూపుల విద్యార్థులు రూ.490, సెకండియర్‌ సైన్స్‌ గ్రూపు విద్యార్థులు (ప్రాక్టికల్స్‌ కలిపి) రూ.690 చెల్లించాలని పేర్కొంది.

ఒకేషనల్‌ సైన్స్‌ గ్రూపు విద్యార్థులు రూ.690, బ్రిడ్జి కోర్సు సహా ఒకేషనల్‌ రాసేవారు రూ.840, సెకండియర్‌ ఒకేషనల్‌ విద్యార్థులు రూ.690, బ్రిడ్జి కోర్సు అయితే రూ.840 చెల్లించాలని పేర్కొంది. ప్రైవేటు విద్యార్థులు ప్రతి సంవత్సరానికి రూ.490 చెల్లించాలని, ఫస్టియర్‌ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకుంటే అసలు ఫీజు రూ.490తో పాటు, ప్రతి సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలని తెలిపింది.