తిరుమల వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతికి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉచితంగా చేసుకోవచ్చు. గోవిందం టూర్ పేరుతో ఈ రైల్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. మూడు రోజులు, రెండు రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. ట్రైన్‌లో పర్యాటకుల్ని తిరుపతికి తీసుకెళ్తుంది ఐఆర్‌సీటీసీ.

ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్ కవర్ అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. రెండుమూడు రోజుల పాటు తిరుమల వెళ్లాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

పర్యాటకులు మొదటి రోజు 12734 నెంబర్ గల రైలును లింగంపల్లిలో సాయంత్రం 5.25 గంటలకు, సికింద్రాబాద్‌లో 6.10 గంటలకు, నల్గొండలో రాత్రి 7.38 గంటలకు ఎక్కాలి. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది. రెండో రోజు తెల్లవారుజామున 5.55 గంటలకు తిరుపతి చేరుకుంటారు. ఐఆర్‌సీటీసీ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత తిరుమలకు తీసుకెళ్తారు. ఉదయం 8.30 గంటలకు స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవచ్చు.

హైదరాబాద్ నుంచి కర్నాటక టూర్… ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలు : తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత తిరుపతిలోని హోటల్‌కు తీసుకెళ్తారు. లంచ్ తర్వాత తిరుచానూర్ తీసుకెళ్తారు. తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం తర్వాత సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. సాయంత్రం 6.25 గంటలకు 12733 నెంబర్ గల రైలు ఎక్కితే మూడో రోజు తెల్లవారుజామున 3.04 గంటలకు నల్గొండలో, 5.35 గంటలకు సికింద్రాబాద్‌లో, 6.55 గంటలకు లింగంపల్లి రైలు చేరుకుంటుంది.

ఐఆర్‌సీటీసీ టూరిజం గోవిందం టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3,690, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3,770, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.4,510. ఇక కంఫర్ట్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5,540, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5,630, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.6,370. కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ రైలు ప్రయాణం, స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం, ఏసీ హోటల్‌లో బస, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ సంబంధించిన మరిన్ని వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.