మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరానికి ‘నారీ శక్తి పురస్కార్’ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశంలో వివిధ రంగాల్లో మహిళల సాధికారతకు, వారి అబివృద్ధికి కృషి చేసిన మహిళలకు, మహిళా సంఘాలకు ఈ జాతీయ అవార్డులు ప్రతి సంవత్సరం ఇస్తారు.

మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ‘నారీ శక్తి పురస్కారాలు’ ఇవ్వనున్నట్టు, నామినేషన్లు సమర్పించడానికి చివరి తేదీ జనవరి 31గా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు సంస్థ వెబ్ సైట్ ను సందర్శించాలి.