సంక్రాంతి పండుగకు సిద్దమవుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ అధికారులు రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జరీ చేసారు. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని.. ఈ నేపథ్యంలో ఆది, సోమవారాలలో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా చలి తీవ్రత తగ్గే అవకాశాలున్నాయని.. ఆగ్నేయ, దక్షిణ దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల కారణంగా చలితీవ్రత తగ్గే అవకాశం ఉందని, ఇంకా ఉత్తర భారతం నుంచి వీస్తున్న చల్లని గాలుల కారణంగా మంచు పొరలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అభిప్రాయపడింది.