ప్రముఖ తెలుగు దేశం పార్టీ ఎం ఎల్ ఏ అచ్చెన్నాయుడు గారు బెయిల్ మీద విడుదల అయిన సందర్భం గా మీడియా తో మాట్లాడారు ఆయన జైలుకి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో వివరించారు.జైలు లో పెట్టినందుకు నేను బాధ పడడం లేదు.డెమోక్రసీ లో ఇలాంటివి అన్ని సహజం, అందులోను ఒక రాజకీయ పార్టీ లో ప్రముఖం వ్యక్తిగా ఉన్నందుకు నామీద ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా దీనిని పేర్కొన్నారు. అయినా సరే భయపడేది,వెనకడుగు వేసేది లేదని అన్నారు.
అసలు జరిగిన విషయం ఏంటంటే… శ్రీకాకుళం జిల్లా, కోట బొమ్మాలి మండలం లో నా స్వగ్రామం నిమ్మాడ .మాది కొత్తగా రాజకీయాలలోకి ప్రవేశించిన కుటుంబం కాదని 1978 సంవత్సరం నుండి ప్రజాసేవలోనే ఉన్నామని వారి చిన్నాన్నలు, అన్నయ్య అయిన ఎర్రన్నాయుడు అందరు రాజకీయాలలోనే ఉన్నారని వారు ప్రజలకి ఎంత దగ్గరగా అందుబాటులో ఉన్నారో ప్రజలకు తెలుసు అని అలాగే ప్రజా సమస్యల మీద చేసే పోరాటం విషయం లో గాని, అన్నిటికన్నా ముఖ్యం గా ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఒకే పార్టీ కోసం పని చేసే నిబద్దత ఉన్న కుటుంబ గా యావత్ ప్రపంచం లో మాకు ఉన్న పేరు మీరు గుర్తించాలి ఆయన గుర్తుచేశారు.
ఇక అసలు విషయానికి వస్తే ప్రతిసారి గ్రామ పంచాయతీ ఎన్నికలలో నిమ్మాడ గ్రామంలో ఏకగ్రీవం గా ఎన్నిక అవుతున్న సంగతి అందరికి తెలుసు.ఈసారి ప్రస్తుత ముఖ్యమంత్రి కారణం గా ఎవరో ఒకరు ఖశ్చితం గా ప్రత్యర్ధులు ఉంటారని మేము దానికి సంసిద్ధంగానే ఉన్నాము.దానిలో భాగంగానే నేను ఆరోజు నాకు సంబందించిన 4 మండలాలకు సంబందించిన అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నాను ఆ సందర్భం లో వైసీపీ మద్దతుతో నిమ్మాడ లో నామినేషన్ వేయాలనుకున్నారో ఆ అభ్యర్థులు నాదగ్గరికి వచ్చి ప్రతిసారి ఇక్కడ ఏకగ్రీవం అవుతుంది కదా అదే విషయానిని మేము ప్రభుత్వానికి తెలియచేసాము ఒకసారి మీరు కూడా మాట్లాడండి అంటే నేను ఫోన్ చేశాను కానీ ఇలా జరుగుతుందని,ఫోన్ రికార్డు అవుతుందని కూడా నేను ఊహించలేదు.మీరు విన్నది అంతా నేను బెదిరించినట్టు ఉంది కానీ నేను ఆలా మాట్లాడలేదు.
అసలు పంచాయతీ ఎన్నిక అంటేనే పార్టీ అభ్యర్థి గ్రామం లో నివసిస్తూ ఉండాలి కానీ ఆరోజు ఒక వ్యక్తికి ఈ రాష్ట్రం లో (ఆ వ్యక్తి పేరు,చరిత్ర,విశేషాలు నేను ప్రస్తావించదలచుకోలేదు)డీసీపీ,సి ఐ లు ప్రత్యేకంగా పోలీస్ ఎస్కార్ట్ లను ఇచ్చి నామినేషన్ వేయడానికి నిమ్మాడ తీసుకు వచ్చి ఇక్కడ గలాటా సృష్టించిన విషయం మీరు మర్చిపోకూడదు.అయిన కూడా మావాళ్లు ఎలాంటి తప్పు చేయలేదు.వాళ్ళ వలెనే ఇలాంటి గొడవ జరిగింది కానీ దీనికి నేనే ఉసిగొల్పాను అనడం,నామీద హత్య నేరం కింద కేసు నమోదు చేయడము ఎంతమాత్రమూ భావ్యం కాదని తెలియచేసారు.

కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన వారికి జ్ఞానం లేకపోయినా కనీసం అనుభవం ఉన్న నాయకులూ అయిన ధర్మాన ప్రసాద్ ,ధర్మాన కృష్ణరాజ్ ఇప్పటి స్పీకర్ అయిన సీతారాం కూడా వారి అనుభవం తో ఆలోచించలేదు.ఎక్కడో సంఘటన
జరిగితే దానికి ఎలాంటి సంబంధము లేని వ్యక్తులకి హత్యానేరం కింద కేసు పెడితే కనీసం స్పందించకపోతే ఎలా?రాజకీయాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు, ఎప్పుడు ఒకే ప్రభుత్వం అధికారం లో ఉండదు.ప్రభుత్వం మారినప్పుడు ఇటువంటి పరిణామం జరిగితే దీనికి బాధ్యులు ఎవరు అని అడుగుతున్నాను అన్నారు.నేను తప్పు చేయలేదు, చేయవలసిన అవసరం కూడా నాకు లేదు.పోలీస్ లు ఆ ఖాకి వస్త్రాలు ధరించిన తర్వాత వాటి ఔన్నత్యం ఎరిగి మసలుకోవాలి ఆయన సూచించారు.జిల్లా ఎస్ పి గారిని ఉద్దేశించి ‘రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి 6 సార్లు ఎం ఎల్ ఏ,రాష్ట్రం లో ముఖ్యమంత్రి గా ప్రాతినిధ్యం వహించిన ఒక వ్యక్తి బహిరంగం గా మీ అందరి సమక్షం లో అచ్చెన్నాయుడిని చంపుదామని మీ నాయకత్వం లో పిలుపునిచ్చి నా ఊరిమీదకి దండయాత్రకు వచ్చినప్పుడు మీరు కనీసం స్పందించనటువంటి నువ్వు ఆ ఖాకి బట్టలకు అర్హుడివా అని నేను ప్రశ్నిస్తున్నాను అని అచ్చెన్నాయుడు గారు ప్రశ్నించారు. మీరు ఉద్యోగం కోసం ఇంత దిగజారిపోవడం మంచిది కాదని రేపు ప్రభుత్వం మారచ్చు అని సూచించారు. ఏదయినా సమస్య వచ్చినప్పుడు ఫిర్యాదు కూడా తీసుకోనటువంటి పరిస్థితిలో పోలీస్ వ్యవస్థ ఉందా? ఆయన ప్రశ్నించారు.దీనికి తగినంత మూల్యం చెల్లించుకోవలసి పరిష్టితి వస్తుందని ఆయన అన్నారు.
నామీద అన్ని ప్రసార మాధ్యమాలలోను చర్చ పెట్టండి.ఆ ఆడియో ని వినండి అందులో ఒక్క చిన్న మాట అయిన బెదిరించినట్టుగా ఉందేమో చూడండి ఆలా ఉన్న పక్షం లో నేను శాశ్వతం గా రాజకీయాలు వదిలి వెళ్తానని అని ఆయన సవాలు చేసారు. నేను బెదిరించానని కొన్ని వార్త మాధ్యమాలలో వేశారు ఆలా తప్పుదోవ పట్టించడం ఎంత వరకు న్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.ఏదేమైనా అచ్చన్నాయుడు తెలుగు దేశానికీ కట్టుబడిన వ్యక్తి అని, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ప్రస్తుత ప్రభుత్వం చేసిన అన్యాయానికి నేను న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన అభ్యర్థులు ఎన్నికలలో ఒత్తిడులకు లొంగకుండా ఇంకా పోటీ చేస్తున్నారని ఆయన స్పష్టం చేసారు. ప్రజలారా విజ్ఞతతో మీ అమూల్యమైన ఓటు ని వేయవలసిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

తరువాత విశాఖ ఉక్కు గురించి ఆయన చర్చించారు.విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు ప్రజల హక్కు అని, దానిని ప్రైవేటీకరణ చేయాలనుకోవడం బాధాకరం అని తెలుగు దేశం పార్టీ కి చెందిన వ్యక్తిగా దీనిని నేను ఖండిస్తున్నానని చెప్పారు.