ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకూ జరిగి ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి 75.58 శాతం ఓట్లు పోల్ అవ్వగా పోలింగ్ ముగిసే సమయానికి 81.78 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈసారి అత్యధికంగా కృష్ణా జిల్లాలో 85.06 శాతం పోలింగ్ నమోదయ్యింది.