అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime)

ఫ్లోరిడా నగరం లో హాకింగ్ కి గురైన మంచి నీటి సరఫరా వ్యవస్థ…

ఫ్లోరిడా రాష్ట్రం ఓల్డ్‌స్మార్ నగర నీటి సరఫరా వ్యవస్థను హ్యాక్ చేసి ఆ నీటిలోకి ప్రమాదకర స్థాయిలో రసాయనాలను కలిపేందుకు ప్రయత్నించిన కంప్యూటర్ హ్యాకర్.
నగర వాటర్ ట్రీట్‌మెంట్ సిస్టమ్‌ను హ్యాక్ చేసి అందులో కలిపే సోడియం హైడ్రాక్సైడ్ మోతాదును పెంచగా గుర్తించిన ఒక ఉద్యోగి వెంటనే ఆ చర్యను తిప్పికొట్టారు.

నీటిలో అసిడిటీ ని నియంత్రించడానికి స్వల్ప మోతాదులో వాడే సోడియం హైడ్రోక్సిడ్ ఎక్కువ మోతాదులో కలిపితే చాల సమస్యలను కలిగిస్తుంది.

ఓల్డ్‌స్మార్ వాటర్ ట్రీట్‌మెంట్ సిస్టమ్‌ను శుక్రవారం ఉదయం హ్యాక్ చేయడానికి ప్రయత్నించగా విధులలో ప్లాంట్ ఆపరేటర్ ఒకరు సిస్టమ్‌ను యాక్సెస్ చేయటానికి జరుగుతున్న ప్రయత్నాన్ని గుర్తించిన కూడా అది తన సూపర్‌వైజర్ అని భావించారని కథనం.

అయితే.. మధ్యాహ్నం మరోసారి ప్రయత్నించిన హ్యాకర్ సాఫ్ట్‌వేర్‌లోకి చొరబడి నీటిలో కలిపే సోడియం హైడ్రాక్సైడ్ మోతాదును 100 పీపీఎం (పార్ట్స్ పెర్ మిలియన్) నుంచి 11,100 పీపీఎంకు పెంచాడు.

ఈ మార్పుని గమనించిన ఆపరేటర్ తక్షణమే దానిని రివర్స్ చేసి.. సాధారణ స్థాయికి తగ్గించాడు.

నీటిలో ఈ సోడియం హైడ్రాక్సైడ్ మోతాదు పెరిగితే.. ఆ నీరు తాకిన చోట అంతా ఇరిటేషన్ కలిగిస్తుంది. జుట్టు తాత్కాలికంగా ఊడిపోగలదు. అదే నీటిని తాగితే నోరు, గొంతు, ఉదరం దెబ్బతింటాయి. వాంతులు, కళ్లుతిరగటం, విరేచనాలు కూడా కలిగించగలదు.

దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అరెస్ట్లు జరగలేదు.ఈ హ్యాకింగ్ అమెరికాలో నుంచే జరిగిందా లేక దేశం బయట నుంచి జరిగిందా అనేదీ ఇంకా తెలియవలసి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.