అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime)

ప్రాంక్ వీడియో చేస్తుండగా కాల్పులు జరిగి ప్రమాదవశాత్తు 20 ఏళ్ళ యువకుడి మృతి

ఒక్కోసారి మనం చేసే చిన్న తప్పులు మన జీవితానిని తల్లకిందులు చేస్తాయి అనడానికి ఉదాహరణగా అలాంటి సంఘటన ఒకటి అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఉన్న నాష్‌విల్లేలో జరిగింది.ఇక అసలు విషయానికి వస్తే టిమోతీ విల్స్, అతడి స్నేహితుడు ప్రాంక్ వీడియో కోసం నాష్‌విల్‌లోని ఒక పార్క్ బయట ఉన్న కొంతమంది దగ్గరకి వెళ్లారు. అయితే వారి దగ్గర పెద్ద కత్తులు కూడా ఉన్నాయని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.వారు చేస్తున్నది ప్రాంక్ అన్న విషయం తెలియక విల్క్స్‌ను అక్కడ ఉన్న ఒక 23 ఏళ్ల యువకుడు తుపాకీతో కాల్చిచంపాడు. అది ప్రాంక్ అనే విషయం తనకు తెలీదని, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపానని ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు.

యూట్యూబ్ కోసం తాము ఒక ప్రాంక్ వీడియో షూట్ చేస్తున్నట్టు మృతుడి స్నేహితుడు తర్వాత పోలీసులకు వివరించిన కూడా అప్పటికే జరగవలసిన ఘోరం జరిగిపోయింది, అయితే ఈ కేసులో పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

దోపిడీ జరుగుతున్నట్లు చూపే ప్రాంక్ వీడియోలు మనం యూట్యూబ్‌లో చాలానే చూస్తుంటాము.వాటిని కొన్నిసార్లు నకిలీ తుపాకులు, ముసుగులను, వాహనాలను ఉపయోగించి షూట్ చేస్తుంటారు.వీటిలో కొన్ని వీడియోలకు లక్షలు, కోట్ల వ్యూస్ వస్తుంటాయి.ఈ దోపిడీ వీడియోల్లో చాలా వరకూ నకిలీవే అయినా, వాటిలో నటించే వారు మాత్రం వీడియో కోసం తమ పాత్రల్లో జీవించేస్తుంటారు.

కానీ, ప్రమాదకరమైన, ఇతరులను భయపెట్టే ప్రాంక్స్‌ను నిషేధిస్తున్నట్లు యూట్యూబ్ రెండేళ్ల క్రితం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.వాటిలో భాగం గా తీవ్ర శారీరక సమస్యలకు గురయ్యేలా ఎవరినైనా భయపెట్టడం లేదా మైనర్లను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసే ప్రాంక్స్ లాంటి వీడియోలను యూట్యూబ్ అనుమతించదు.ఆయుధాలతో బెదిరించడం, నకిలీ దోపిడీలు లాంటి వీడియోలను ప్రత్యేక నేరాల జాబితాలోకి చేర్చారు. అలాంటి వీడియోలను యూట్యూబ్ నిబంధనల్ని అనుసరించి తొలగిస్తారు.

ఇంతకు ముందు జరిగిన ఇలాంటి కొన్ని తీవ్రమైన ఘటనల వల్ల యూట్యూబ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.ఆ ఘటనలు ఏంటంటే…
2015లో శామ్ పెప్పర్ అనే ఒక వ్లాగర్, ఒక వ్యక్తిని కాల్చి చంపేసినట్టు ప్రాంక్ చేసి అతడి స్నేహితుడిని తీవ్రంగా భయపెట్టాడు. కానీ, ఆ వీడియోను తొలగించడానికి యూట్యూబ్ ఒప్పుకోలేదు.

దాని తరువాత 2017లో 19 ఏళ్ల మోనాలిసా పెరేజ్ మందంగా ఉన్న పుస్తకాన్ని తుపాకీకి అడ్డంగా పెట్టి తన బాయ్‌ఫ్రెండ్ పెడ్రో రూయిజ్‌ మీద కాల్పులు జరిపారు. కానీ, పుస్తకంలోంచి దూసుకొచ్చిన బుల్లెట్ తగిలి అతడు చనిపోయాడు.ఈ నేరానికి పెరేజ్‌కు 2018 మార్చిలో ఆరు నెలల జైలు శిక్ష విధించారు. అది జరిగిన దాదాపు పది నెలల తర్వాత యూట్యూబ్ ప్రమాదకరమైన ప్రాంక్‌లను నిషేధించింది.కానీ మరల ఇలాంటి దురదృష్టకర సంఘటన జరిగినది.
ఇలా జరగడానికి కారణం ఎవరు?? ఎక్కువ వ్యూస్ కోసం ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ చేసిన ఆ వ్యక్తిదా?? ఇలాంటి వీడియోస్ మీద ఆసక్తి చూపించే ప్రేక్షకులదా?? లేక ఒక కేవలం తనకి ఏదయినా ప్రమాదం సంభవిస్తుందేమో అన్న అనుమానం తో ముందు వెనుక ఆలోచించకుండా తుపాకీ తో కాల్చిన ఆవ్యక్తిదా?? మీరే ఆలోచించండి…

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.