జగన్ అన్న సంధించి వదిలిన బాణం తెలంగాణ లో పాగా వేయబోతోందా?
YS షర్మిల తెలంగాణ లో కొత్త పార్టీ ని స్థాపించబోతుందా? ఇలాంటి కథనాలు గత కొన్ని రోజులుగా వార్తలలో నిలిచాయి…అలాంటి అన్ని కథనాలకు ఇక ముగింపు వచ్చేసినట్టే!
ఎందుకంటే వై స్ షర్మిల తెలంగాణ లో పార్టీ స్థాపించబోతున్నారు.
వై ఎస్ ఆర్ టి ఎస్ లేదా టి ఎస్ వై ఎస్ ఆర్ పార్టీ పేరుతో కొత్త పార్టీ ని స్థాపించబోతున్నారు.ఇప్పుడు ఇంత అత్యవసరం గ తెలంగాణ లో కొత్త పార్టీ స్థాపించవలసిన అవసరం ఏముంది అని విశ్లేషిస్తే…ఇప్పుడు టి ఆర్ ఎస్ పార్టీ కి పోటీ గా బిజె పి మరియు కాంగ్రెస్ పార్టీ లు పుంజుకుంటున్న వేళ, టి ఆర్ ఎస్ పార్టీ కొంచం కొంచం గా బలహీనమవుతున్నవేళ ఇప్పుడు తెలంగాణ లో సరికొత్త పార్టీ అవసరమా అంటే ఖశ్చితంగా అవుననే అంటున్నారు ఎందుకంటే అది జగన్ కి చాల ఉపయోగపడేటటువంటి అంశం.లోపాయికారి ఒప్పందాల ప్రకారమే వై ఎస్ షర్మిల ఇప్పుడు తెలంగాణ లో పార్టీ ని స్థాపించబోతుంది.రేపు బిజె పి ని ఎదుర్కోవాలంటే టి ఆర్ ఎస్ పార్టీ కి మరొక బలం అవసరం.ఇది కె సి ఆర్ ని ఢీకొట్టడానికో, ఓడించడానికో, ఇరుకున పెట్టడానికో స్థాపించిన పార్టీ కాదు.తెరాస పార్టీ కి అనుబంధ పార్టీ గా మాత్రమే షర్మిల తెలంగాణ లో పార్టీ ని స్థాపించబోతున్నారు అని పరిశోధన లో వెల్లడయిన అంశం.