క్రైమ్ (Crime) వార్తలు (News)

భూమా జ‌గ‌త్ విఖ్యాత్, భార్గ‌వ్ రామ్ కు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం

ఒక భూ వివాదంలో బోయిన‌ప‌ల్లి నుంచి ఇద్ద‌రిని కిడ్నాప్ చేసి వారి చేత ప‌త్రాల మీద సంత‌కాలు పెట్టించుకునే ప్ర‌య‌త్న‌మేదో జ‌రిగిన‌ట్టు వ్య‌వ‌హారంలో కుట్ర‌దారులుగా భూమా అఖిల, భూమా జ‌గ‌త్ విఖ్యాత్, భార్గ‌వ్ రామ్ కూడా నిలిచారు. ఆమెను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ఇప్పుడు అఖిల‌ప్రియ భ‌ర్త‌కు బెయిల్ ల‌భించింది. కిడ్నాపింగ్ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి పరారీలోనే ఉన్న భార్గ‌వ్ రామ్ కు కూడా ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ను న్యాయ‌స్థానం మంజూరు చేసింది. ఈ కేసులో భార్గ‌వ్ రామ్ తో పాటు భూమా జ‌గ‌త్ విఖ్యాత్ కు కూడా న్యాయ‌స్థానం బెయిల్ మంజూరు చేసిన‌ట్టుగా స‌మాచారం.

ఈ వివాదంలో భూమా అఖిల కొన్ని రోజుల పాటు జైల్లో గ‌డిపారు. త‌న భార్య అరెస్టు అయినా కూడా భార్గ‌వ్ రామ్ మాత్రం మీడియా ముందుకు రావ‌డం కానీ, పోలీసుల‌కు లొంగిపోవ‌డం కానీ చేయ‌లేదు. కొన్ని రోజుల పాటు జైల్లో గ‌డిపిన అనంత‌రం అఖిల‌ప్రియ‌కు న్యాయ‌స్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆ త‌ర్వాతా భార్గ‌వ్ రామ్ పరారీలోనే ఉంటూ వ‌చ్చారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు, జ‌గత్ విఖ్యాత్ కూ ఈ కేసులోని ఇత‌ర నిందితుల‌కూ కూడా న్యాయ‌స్థానం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. మొత్తానికి అరెస్టు కాకుండా, ప‌రారీలో ఉంటూనే బెయిల్ తెచ్చుకున్నారు భూమా అఖిల‌ప్రియ భ‌ర్త భార్గ‌వ్ రామ్.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.