జాతీయం (National) వార్తలు (News)

గత ఏడాదిలో స్వచ్చందంగా మూతబడిన కంపెనీల సంఖ్య

గత ఏడాది కరోనా వల్ల అన్ని వ్యాపారాలు కుదేలైన విషయం తెలిసిందే! ఈ తరుణంలోనే గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఫిబ్రవరి వరకు దేశంలో 10,000కి పైగా కంపెనీలు స్వచ్ఛందంగా మూతపడ్డాయని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ పరిణామాలతో ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అవరోధాలు ఏర్పడడమీ దీనికి కారణంగా పేర్కొంది. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద లభ్యమవుతున్న తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనగా ఏప్రిల్- ఫిబ్రవరి వరకు 2014 కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 248(2) కింద మొత్తం 10,113 కంపెనీలను మూసివేశారు.

ఎలాంటి చట్టపరమైన చర్యల వల్ల కానీ అనవసర బలవంతాల వల్ల కాకుండా స్వచ్ఛందంగానే వ్యాపారాలను కంపెనీలు ఆపేశాయనే విషయాన్ని సెక్షన్‌ 248(2) తెలియజేస్తుంది.


దేశంలోనే అత్యధికంగా దిల్లీలో 2,394 కంపెనీలు మూతపడ్డాయి. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్‌ (1,936 కంపెనీలు) ఉంది. మూడవ స్థానంలో తమిళనాడు 1,322,
నాల్గవ స్థానంలో మహారాష్ట్ర 1,279, ఐదవ స్థానంలో కర్ణాటక 836, ఆరవ స్థానంలో చండీగఢ్‌ 501, ఏడవ స్థానంలో రాజస్థాన్‌ 479, ఎనిమిదవ స్థానంలో తెలంగాణ 404, తొమ్మిదవ స్థానంలో కేరళ 307, పడవ స్థానంలో ఝార్ఖండ్‌ 137, పదకొండవ స్థానంలో మధ్యప్రదేశ్‌ 111, పన్నెండవ స్థానంలో బిహార్‌ 104 కంపెనీలను స్వచ్ఛందంగా మూసివేశారు.
2020-21లో వ్యాపారాలను ఆపేసిన నమోదిత కంపెనీల వివరాలను తెలియజేయాల్సిందిగా పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఈ వివరాలను తెలియజేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.