అమెరికాలోని శాన్‌డియాగో జూ లో గొరిల్లాలు గత జనవరిలో వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే! వాటికి అప్పట్లో ప్రత్యేక చికిత్స అందించి కాపాడారు. ఇప్పుడు వాటికి కరోనా టీకా అందించారు. టీకా తీసుకున్న వాటిలో నాలుగు ఒరంగుఠాన్‌లు, ఐదు బొనొబొలు ఉన్నాయి.
జూ సిబ్బందికి కొవిడ్‌ సోకడంతో వీరి ద్వారా ఈ జంతువులు మహమ్మారి బారిన పడడంతో వాటికి టీకా అందించడం జరిగింది. వీటి పరిస్థితి బాగానే ఉందని దగ్గు, జలుబు వంటి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నాయని అధికారులు వెల్లడించారు.