దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,388 మందికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారించబడ్డారని దీనితో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,12,44,786కి చేరింది. దేశవ్యాప్తంగా నిన్న కోలుకున్నవారి సంఖ్య 16,596 కాగా, ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 1,08,99,394 కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది

ఇక గురువారం ఒక్కరోజే 77 మంది కరోనా బారినపడి మృతి చెందగా, ఇప్పటి వరకు మొత్తంగా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,57,930కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,87,462 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మునపటి కంటే కూడా చాలా భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజులో 8,744 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేరళలో 1,412 కొత్త కేసులు బయటపడ్డాయి. దీనితో ఈ రెండు రాష్ట్రాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు.