భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌకర్యం కోసం నిరంతరం ఏదో ఒక ఏర్పాట్లు చేస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు రైల్వే ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ కి కాల్ చేయాలంటే వివిధ నెంబర్ లు డయల్ చేయవలసి ఉండేది.కానీ ఇప్పుడు రైల్వేకు సంబంధించిన ఫిర్యాదుల కోసం వివిధ నంబర్లు డయల్ చేయాల్సిన అవసరంలేదు. అన్ని నంబర్లను రైల్వేశాఖ విలీనం చేయగా, అన్ని నంబర్లకు బదులు ‘139’ నంబర్ డయల్ చేస్తే సరిపోతుంది. ప్రయాణికులు ‘139’ నంబరుకు డయల్ చేసి రైల్వే ప్రయాణానికి సంబంధించిన ఏ ఫిర్యాదునైనా తెలియజేయవచ్చు. ఈ నూతన హెల్ప్‌లైన్ వినియోగంలోకి రావడంతో మిగిలిన హెల్ప్ లైన్ నంబర్లు ఇక పనిచేయవని రైల్వేశాఖ తెలిపింది.