బిట్టు శ్రీనుకు ఏడు రోజుల కస్టడీ ముగియడంతో నిందితుడిని పోలీసులు ఇవాళ కోర్టులో హజరుపరిచారు. హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతులను గత నెల 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద రోడ్డుపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడుగా బిట్టు శ్రీను అనే వ్యక్తి ఉన్నట్టు పాఠకులకు తెలిసిందే!

అతనికి విచారణ జరిపిన మంథని కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. అనంతరం నిందితుడిని వరంగల్‌ జైలుకు తరలించారు. న్యాయవాద దంపతుల హత్యకేసులో నిందితులకు బిట్టు శ్రీను మారణాయుధాలు, వాహనం సమకూర్చాడని మరియు కుంట శ్రీనుతో కలిసి హత్యకు ప్రణాళికలు వేసినట్లు అభియోగాలున్నాయి.

దంపతుల హత్య కేసుకు సంబంధించి బిట్టు శ్రీనుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ముగ్గురిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. ఇవాళ బిట్టు శ్రీనును న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.