గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సాహితీవేత్త అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి(84) ఈరోజు కన్నుమూశారు. ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అన్నపరెడ్డి 1933 ఫిబ్రవరి 22న గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరు లో జన్మించారు. సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ మనస్తత్వ శాస్త్రం, బౌద్ధ సాహిత్యాన్ని ఆయన తెలుగులో పరిచయం చేశారు. హైదరాబాద్‌ మదీనాగూడలో రేపు అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.