‌పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలంలో పి.అంకంపాలెంలో బుధవారం రాత్రి ఈడా నరేష్‌ ఇంటి బయట రెండు తలల పామును గుర్తించి వారు గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా వారు ఇది చాలా అరుదైన పాము అని తెలియక దానిని హతమర్చారు. వాడుక భాషలో దీనిని బంగారు మన్ను పాముగా పిలుస్తారు. ఈ జాతి పాములు ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో కనిపిస్తాయట.

రెండు తలల పామును స్మగ్లర్స్ ఎక్కువ డబ్బులకు అమ్ముతుంటారని, పాము ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని భావిస్తూ చాలామంది వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకుంటారని, ఈ పాము ప్రజలకు ఎలాంటి హాని చేయదని, కీటకాలు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది అని అన్నారు. ఒక్క పాము ఖరీదు లక్షల్లో ఉంటుందని అంచనా. ఔషదాలు, తాంత్రిక పూజల్లో ఈ పాములను ఉపయోగిస్తారాణి అందుకే ఈ పాములకు డిమాండ్ ఎక్కువనే ప్రచారం జరుగుతోంది.