కొజికోడ్ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానంకు కార్గో కంపార్ట్‌మెంట్ నుంచి ఫైర్ వార్నింగ్ రావ‌డంతో పైల‌ట్లు అప్ర‌మ‌త్త‌మై విమానం అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేసారు. ఈ విమానం మొత్తం 17 మంది ప్ర‌యాణికులతో కాలిక‌ట్ నుంచి కువైట్ బ‌య‌ల్దేరిన కాసేప‌టికే ఫైర్ వార్నింగ్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అత్య‌వ‌స‌రంగా విమానాన్ని దించివేసి విమానం ల్యాండ్ అవ‌గానే అక్క‌డికి అగ్నిమాప‌క ద‌ళాలు వెళ్లాయి. ప‌రిస్థితిని అగ్నిమాప‌క ద‌ళాలు ప‌ర్య‌వేక్షిస్తున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.