తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో బుధవారం 13 మంది రిమాండ్‌ ఖైదీలకు జ్వరం రావడంతో జైలు అధికారులు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. గురువారం ఫలితాలు రాగా.. వీరికి వైరస్‌ సోకినట్లు జైలు సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. గతంలో ఇదే కారాగారంలో 9 మంది ఖైదీలకు కొవిడ్‌ నిర్ధారణ కావడంతో వారితో పాటు ఈ 13 మంది ఖైదీలకు కారాగారంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు, ప్రస్తుతం ఖైదీల ఆరోగ్యం నిలకడగా ఉందని సూపరింటెండెంట్‌ వెల్లడించారు.