వార్తలు (News)

కరోనా పేరుతో ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాల దోపిడీ

రాజధానిలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కరోనాను అడ్డుపెట్టుకుని బాధితులను అడ్డగోలు దోపిడీకి గురి చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ వేయాలంటే డోసుకు రూ.3 వేలు, వైద్యానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్యాకేజీ కింద మాట్లాడుకుని మరీ దోచుకుంటున్నాయి.

ప్రభుత్వ పరంగా ప్రస్తుతం కేవలం గాంధీ, టిమ్స్, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో మాత్రమే కరోనా వైద్యం లభిస్తుండగా సీరియస్‌గా ఉన్న వారికే గాంధీలో చోటు లభిస్తుంది. మిగతా రెండింటిలో చేరేందుకు చాలామంది ఆసక్తి చూపడంలేదు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐసోలేషన్‌ కేంద్రాలు అందుబాటులో లేవు. పెద్ద ప్రైవేటు వైద్యశాలల్లో పడకలన్నీ నిండిపోయాయి.

పెద్ద ఆస్పత్రులు కరోనా రోగుల కోసం పడకలను పెంచే ఉద్దేశంలో లేకపోవడంతో దీన్ని ఆసరాగా చేసుకొని బాధితుల బంధువులతో ‘ఆరు రోజులకు రూ.5 లక్షల ప్యాకేజీ అవుతుంది. నగదు రూపంలో చెల్లిస్తే వైద్యం మొదలుపెడతాం’ అంటూ చెబుతున్నాయి. ఇక నగరంలో కొవాగ్జిన్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని ఆస్పత్రులు కొవాగ్జిన్‌ ఒక్కో డోసుకు రూ.3 వేలు, ఆపైన వసూలు చేస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.