నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని గూడూరుకు చెందిన జొన్నలగడ్డ ప్రవీణ్ (45)కు వైర్‌లెస్, కమ్యూనికేషన్ సంస్థ కామ్‌స్కోప్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐవో)గా నియమితులయ్యారు. ఇది అత్యంత అరుదుగా లభించే గౌరవంగా చెప్తారు. సంస్థలోని 50 మంది సాంకేతిక నిపుణుల్లో ఆయన ముఖ్యుడిగా ఉండడంతోనే ఈ గౌరవం లభించింది. ప్రవీణ్ గత పుష్కరకాలంగా కామ్‌స్కోప్‌లోనే వివిధ హోదాల్లో అనగా డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంటి హోదాల్లో సేవలు అందించారు.

గూడూరుకు చెందిన ప్రవీణ్ అక్కడే గణితంలో బీఎస్సీ చేసి తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ చేసి ఆ తరువాత 2001లో అదే యూనివర్సిటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ‌లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత వివిధ సంస్థల్లో పనిచేసిన ప్రవీణ్ 12 ఏళ్ల క్రితం కామ్‌స్కోప్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఆ సంస్థకు సీఐవోగా నియమితులయ్యారు.