విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టు నుంచి అల్యూమినియం పౌడరు లోడుతో వెళ్తున్న ఒడిశాకు చెందిన బల్క్‌ ట్యాంకరు లారీ గురువారం తెల్లవారుజామున గాజువాక డంపింగ్‌ యార్డు సమీపంలో అదుపు తప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టి, దూసుకెళ్లి, వాహనంలో సగ భాగం గాల్లో వేలాడుతూ ఉండిపోవడంతో డ్రైవర్‌ భయంతో వాహనం నుంచి దూకేశాడు. దీంతో గాజువాక ట్రాఫిక్‌ ఎస్‌ఐ అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ల సాయంతో లారీని బయటకు తీయించారు.