ఒకప్పుడు బ్రతకలేక బడిపంతులు.. అనే నానుడి ఉండేది ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో అది మళ్ళీ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. కరోనా నేపథ్యంలో ఎన్ని కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయో మనం చూస్తూనే ఉన్నాం! ఇదే కోవలో ఉన్న ప్రైవేటు టీచర్ల పరిస్ధితి దయనీయంగా మారింది. విద్యార్థులను సంస్కారవంతులుగా, విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహించే బడి పంతుళ్లు నేడు రోడ్ల పాలయ్యారు. కొందరు కూరగాయలు అమ్ముతుంటే మరికొందరు చిరు వ్యాపారాలు చేసి పొట్ట పోసుకుంటున్నారు. ఏ ప్రైవేట్ స్కూల్ లో పని చేసే టీచర్ ను కదిపినా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్‌ స్కూళ్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.