జాతీయం (National) వార్తలు (News)

ఊగిసలాటల్లో నేటి మార్కెట్లు ..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమై ఒక దశలో లాభాల్లోకి చేరుకొని ఇంట్రాడే గరిష్ఠాల్ని తాకి, మధ్యాహ్నం తర్వాత కీలక రంగాల్లో అమ్మకాలు పెరగడంతో కిందకు దిగజారాయి. ఉదయం 49,743 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైన సూచీ 49,906 వద్ద గరిష్ఠాన్ని తాకిన అనంతరం మధ్యాహ్నం తర్వాత కీలక రంగాల షేర్లలో అమ్మకాలు పెరిగిన దరిమిలా 49,461 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 154 పాయింట్ల నష్టంతో 49,591 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 14,882 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 14,918-14,785 మధ్య కదలాడి చివరకు 38 పాయింట్లు కోల్పోయి 14,834 వద్ద స్థిరపడింది.

టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌, సన్‌ ఫార్మా, సిప్లా, విప్రో లిమిటెడ్‌ కంపెనీల షేర్లు లాభాలు చవిచూడగా టాటా స్టీల్‌, యూపీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలు చవిచూడగా, నిఫ్టీ సంబంధిత రంగాల్లో సీపీఎస్‌ఈ, లోహ, ఇంధన, బ్యాంకింగ్‌ రంగ సూచీలు నష్టాలు చవిచూడగా హెల్త్‌కేర్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, టెక్‌ రంగ సూచీలు లాభాల్లో ముగిశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.