వార్తలు (News)

కరోనాకు బదులు రేబిస్ వాక్సిన్ ఇస్తే??

కరోనా వ్యాప్తి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి తమ వంతు ప్రయత్నిస్తుంటే క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం వ్యాక్షినేషన్‌ విషయంలో అసలసత్వాన్ని ప్రదర్శించడం కాదు దురదృష్టకరం! కోట్లు ఖర్చు చేసి వ్యాక్సిన్ డోసులను క్షేత్రస్థాయి ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తుంటే వారు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా, వాటిపై అవగాహనా పెంచుకోకుండా ఉండడం పలు సమస్యలకు దారితీస్తుంది. తాజాగా యూపీలోని షమ్లి జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్‌కు బదులుగా ముగ్గురు వ్యక్తులకు రేబిస్ వ్యాక్సిన్ వేశారు.

కంధ్లా ప్రాంతానికి చెందిన సరోజ్(70), అనార్కలి(72), సత్యవతి(60) మహిళలు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకునేందుకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు రాగా ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది ఆ మహిళలకు రేబిస్ వ్యాక్సి్న్ ఇచ్చారు. అయితే, తమకు ఇచ్చింది కోవిడ్ వ్యాక్సిన్ కాదని, రేబిస్ వ్యాక్సిన్ అని వారికి తెలియదు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న మహిళలు నేరుగా ఇంటికి వచ్చారు. మొదట బాగానే ఉన్నప్పటికీ ఆ తరువాత వారిలో ఒక మహిళకు ఆరోగ్యం క్షీణించండం ప్రారంభించింది.

కుటంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తే అసలు విషయం అప్పుడు వెలుగు చూసింది. ఆరోగ్య కేంద్రంలో సదరు మహిళలకు రేబిస్ టీకా వేసినట్లు వైద్యులు నిర్ధారించి ఇదే విషయాన్ని బాధిత కుటుంబానికి తెలిపారు. వెంటనే వారు సీఎంవోకు ఫిర్యాదు చేయడంతో ఈ ఫిర్యాదుకు రియాక్ట్ అయిన అధికారులు సంబంధిత ఘటనపై విచారణకు ఆదేశించారు. తప్పు జరిగినట్లు తేలితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇదే సమయంలో బాధిత మహిళల తప్పు ఉన్నా వారిపైనా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.