వార్తలు (News)

భారత్ లో 43,393 కొత్త కేసులు.. 911 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల్లో 17,90,708 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కొత్తగా 43,393 కేసులు నమోదవడంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.07 కోట్ల కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే 911 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4,05,939 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 44,459 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీలు 2.98 కోట్లకు చేరుకుని రికవరీ రేటు 97.19 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఇంకా 4.58లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతుండగా క్రియాశీల రేటు 1.49శాతానికి తగ్గింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •