వార్తలు (News)

కెంప్టీ వాటర్‌ఫాల్స్‌.. అరగంట కన్నా ఎక్కువ సమయం గడపవద్దు??

లొక్డౌన్ నిబంధనలు సడలించడంతో పర్యాటక ప్రాంతాలు అన్ని జనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్‌లోని కెంప్టీ జలపాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ముస్సోరీలో ఉన్న ఆ వాటర్‌ఫాల్స్ వద్ద సేదతీరేందుకు జనం భారీ సంఖ్యలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. మాస్క్‌లు ధరించకుండా, సోషల్ డిస్టాన్స్ పాటించకుండా.. ఒకే చోట పెద్ద ఎత్తున జనం గుమ్మిగూడడం వల్ల మళ్లీ కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించడంతో అప్రమత్తమైన ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేస్తూ కెంప్టీ జలపాతం వద్ద 50 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో ఒకేసారి టూరిస్టులు ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది.

ఆ వాటర్‌ఫాల్స్‌కు వచ్చిన వాళ్లు అరగంట కన్నా ఎక్కువ సమయం గడపవద్దు అని కూడా పేర్కొంటూ దానిని మానిటర్ చేసేందుకు ఓ చెక్ పోస్టును ఏర్పాటు చేసినట్లు తెహ్రీ ఘర్‌వాల్ జిల్లా మెజిస్ట్రేట్ ఇవా ఆశిష్ శ్రీవాత్సవ్ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •