వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

యురొ కప్ లో 55 ఏళ్ల తర్వాత తొలిసారి ఇంగ్లాండ్‌ ఫైనల్ కు!!

యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్‌ రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 2-1 తేడాతో డెన్మార్క్‌ను ఓడించి తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 55 ఏళ్ల తర్వాత ఓ మేజర్‌ టోర్నీలో సెమీస్‌ను దాటి ఫైనల్‌కు వెళ్లడం మొదటిసారి. ఆదివారం జరిగే తుదిపోరులో ఇటలీని ఢీకొట్టనుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి నుంచి ఇంగ్లాండే ఆధిపత్యం ప్రదర్శించింది. 30వ నిమిషంలో డెన్మార్క్‌ ఆటగాడు డ్యామ్స్‌గార్డ్‌ పెనాల్టీ కిక్‌ను అద్భుతంగా గోల్‌చేసి ఆ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే డెన్మార్క్‌ ఆటగాళ్ల తప్పిదంతో ఇంగ్లాండ్‌ స్కోర్‌ను సమం చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •