క్రైమ్ (Crime) వార్తలు (News)

బ్లాక్‌ ఫంగస్‌ ఔషధం పేరుతో నకిలీ మందులు!!

మ్యూకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) ఔషధం పేరుతో దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న నకిలీ మందుల మాఫియాను అధికారులు ఛేదించారు. ‘క్యువికోన్‌’ పేరుతో హైదరాబాద్‌లో తయారుచేస్తున్న వీటిని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, సూరత్‌ ప్రాంతాలతో పాటు దేశంలోని పలు నగరాల్లో అమ్ముతున్నారు. రూ. 50 లక్షల విలువైన పొసకొనజోల్‌ మాత్రలు, నోటి ద్వారా వేసుకునే ద్రావణాన్ని సీజ్‌ చేశారు. హైదరాబాద్‌లో ఆస్ట్రా జెనిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ఈ మందుల్ని తయారుచేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌కే చెందిన ఆస్పెన్‌ బయోఫార్మా ల్యాబ్స్‌ సాయంతో వీటిని ఒక్కో డోసు రూ. 20,500 చొప్పున విక్రయిస్తున్నట్లు తేలింది.

కరోనాకు చికిత్స పొందిన పలువురు బాధితులకు అతిగా స్టిరాయిడ్స్‌ వాడకం వల్ల కొందరిలో రోగనిరోధకశక్తి క్షీణించి బ్లాక్‌ ఫంగస్‌ దాడి చేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వేలాదిగా కేసులు నమోదు కావడంతో దాని నివారణకు వాడే పొసకొనజోల్‌ ఇంజెక్షన్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.

ఇదే అదనుగా రంగంలోకి దిగిన అక్రమార్కులు ‘క్యువికోన్‌’ పేరుతో పొసకొనజోల్‌ మాత్రలు, నోటి ద్వారా వాడే ద్రావణాన్ని తయారుచేసి విక్రయిస్తున్నారు. ‘క్యువికోన్‌’ మందుపై అనుమానం వచ్చి గుజరాత్‌లోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అధికారులు వాటిని పరీక్షల కోసం వడోదరలోని ప్రయోగశాలకు పంపారు. పరీక్షల్లో అవి నకిలీవని, ఎఫ్‌డీఏ అధికారులు తెలంగాణ డ్రగ్‌ కంట్రోలర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడగా అసలు ఆ కంపెనీకి అనుమతులు కూడా లేవని వెల్లడైంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •