అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

టీకా తీసుకొండి.. లేదంటే ఉద్యోగం ఉండదు??

కొత్త కొత్త మ్యుటేషన్లతో కరోనా వైరస్ విజృంభణకు అన్ని దేహసాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఆ ప్రభావం కొంతమేర అయినా తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రజలను టీకాలు వేసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. టీకా గురించి పెద్దగా పట్టించుకోని వారి విషయంలో తీవ్ర నిర్ణయాలు తీసుకునేందుకు పలు దేశాలు వెనుకాడటం లేదు. తాజాగా ఫిజీ ప్రభుత్వం టీకాలు తీసుకోకపోతే, ఉద్యోగాలు ఉండవు అని హెచ్చరించింది.

‘ప్రభుత్వ ఉద్యోగులంతా ఆగస్టు 15 నాటికి టీకా మొదటి డోసు తీసుకోకపోతే సెలవులో వెళ్లాల్సి ఉంటుంది. నవంబర్‌ ఒకటికల్లా రెండో డోసు వేయించుకోపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తాం. అలాగే ప్రైవేటు ఉద్యోగులు ఆగస్టు ఒకటికల్లా మొదటి డోసు వేయించుకోవాలి. లేకపోతే వ్యక్తిగతంగా భారీ జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుంది. సంస్థలు మూసివేసుకోవాల్సి వస్తుంది. టీకా తీసుకోకపోతే..ఉద్యోగాలు ఉండవు (NO JABS, NO JOBS)’ అంటూ ఫిజీ ప్రధాని ఫ్రాంక్‌ బైనిమారామా తీవ్ర హెచ్చరిక చేశారు. మాములుగా చెప్పినప్పుడు ప్రజలు వినకపోతే మరి ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలే తీసుకోవలసి ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •