అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

తాలిబన్‌ల అధీనంలో ఇస్లామ్ కాలా క్రాసింగ్!!

ఇరాన్ సరిహద్దుల్లోని కస్టమ్స్ కార్యాలయం పైకప్పుపై ఉన్న అఫ్గానిస్తాన్ జెండాను తాలిబన్‌లు తొలగిస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చి ఇరాన్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అందరికి అసలు విషయం ఏమిటో తెలియక ఉత్సుకత పెరిగిపోయింది. అయితే ఏమిజరిగిందంటే.. అమెరికా సేనలు వైదొలగడంతో తాలిబన్‌లు మళ్లీ జోరు పెంచి అఫ్గానిస్తాన్ అంతటా అనేక ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్, ఇరాన్ మధ్య పెద్ద వాణిజ్య మార్గాలలో ‘ఇస్లామ్ కాలా క్రాసింగ్’ అనే ప్రాంతం నుండి అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి దీని ద్వారా నెలకు 2 కోట్ల డాలర్ల విలువైన ఆదాయం వస్తుంది.

400 జిల్లాలున్న అఫ్గానిస్తాన్‌లో మూడో వంతు కంటే ఎక్కువ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని, హేరత్ ప్రావిన్స్‌లో ఉన్న ఇస్లామ్ కాలా క్రాసింగ్‌ను తాలిబన్‌లు స్వాధీనం చేసుకున్నాని అఫ్గాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

”సరిహద్దు భద్రతా దళాలు సహా అన్ని అఫ్గాన్ బలగాలు ఇస్లామ్ కాలా క్రాసింగ్‌ను తిరిగి ప్రభుత్వపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి” అని అఫ్గాన్ హోం మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా వెల్లడించింది.

మరోవైపు ఇస్లామ్ కాలా మార్గం పూర్తిగా తమ నియంత్రణలో ఉందని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించినప్పటికీ ప్రభుత్వపరం చేస్తారా? లేదా అన్న విషయం పై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •